సహోదరుల కొరకు ప్రాణం పెట్టు-Telugu messages about bible

క్రైస్తవుడు వలన సమాజానికి మంచే జరిగింది తప్ప.క్రైస్తవుడు వలన సమాజానికి కలలో కూడా చెడు జరగదు.ఇది క్రైస్తవులకు బైబిల్ నేర్పించిన బోధ. క్రీస్తు మాకు నేర్పించిన మార్గమేంటి చెప్పమంటావా “సహోదరుల కొరకు ప్రాణం పెట్టడం” ప్రపంచంలో ఎంత గొప్ప మార్గం “సహోదరుల కొరకు ప్రాణం పెట్టడం” ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకం, ఏ జ్ఞానం ఈ మార్గం నేర్పించలేదు. ప్రాణం పెట్టమని చెబుతుంది క్రీస్తు ప్రేమ ప్రాణాలు తీయండి అనడం లేదు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి  మమతాబెనర్జీ.

 మమతాబెనర్జీ మీ అందరికీ తెలుసు, మమతా బెనర్జీ గారు ప్రధాని రేసులో కూడా ఉన్నారు. చాలా గొప్ప నాయకురాలు. ఆమె మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడింది నేనెందుకు క్రైస్తవురాలు గా పుట్టలేదు.

భారతదేశంలో లో నేనెందుకు క్రైస్తవ రాలిగా పుట్టలేదు బాధను వ్యక్తం చేసింది. క్రైస్తవుడు చేస్తున్న బోధలు, క్రైస్తవుడు చేస్తున్న కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన మిషనరీలు చేస్తున్న సేవను చూసినప్పుడు నేనెందుకు క్రైస్తవురాలు గా పుట్టలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గారు. గమనించారా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆవిడ క్రైస్తవ్యం గురించి చెప్పిన గొప్ప మాట.

డాక్టర్  సి హెచ్ విద్యాసాగర్ గారు

మహారాష్ట్రనికి ప్రస్తుతం గవర్నర్ గా పని చేస్తున్నారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారత జనతా పార్టీకి అధ్యక్షుడిగా పని చేసాడు కరీంనగర్ కి ఎంపీగా చేసి చాలాసార్లు గెలిచాడు డాక్టర్ ఆర్ సి హెచ్ విద్యాసాగర్ గారు. ఆయన అన్న మాటలు క్రైస్తవం గురించి,

క్రైస్తవ్యం దేశానికి చేసిన సేవ చాలా గొప్పది. క్రైస్తవ్యం లేని దేశాన్ని ఊహించడం చాలా కష్టం, క్రైస్తవులు క్రైస్తవ్యం లేని భారతదేశాన్ని ఊహించలేం. అని సి హెచ్ విద్య సాగర్ గారు క్రైస్తవం గురించి ఇచ్చిన గొప్ప మాట.

క్రైస్తవుడా! నీ గొప్పతనం ఏంటో అర్థం అవుతుందా? క్రైస్తవం గొప్పతనం ఏంటో మనకు అర్థం కావాలి, ఇప్పుడు మీ శక్తి ఏంటో నీకు తెలియడం లేదు. ఒక్కసారి ఈ మాటలు చదివిన తరువాత ఇంత గొప్పదా క్రైస్తవ్యం మనం విన్న ఈ మాటలు ఎంత గొప్పవా? మనం నమ్మిన ప్రభువు ఇంత గొప్పవాడా? అయితే నేనేం చేస్తున్నాను ఎలా బ్రతుకుతున్నాను ఒక్కసారి నిన్ను నీవు విమర్శించు నిన్ను నీవు ప్రశ్నించుకో

నీలో ఉన్న లోపాలను సరి చేసుకో సమాజాన్ని సరిచేయడానికి కదులు.

వెళ్లాలి సమాజాన్ని బాగు చేయడానికి సమయం చాలా అయిపోయింది దేవుడు నీకు ఇచ్చింది. ఇక ఎంతకాలము నీకు తెలియదు. సంవత్సరమా మరో సంవత్సరమా మరో సంవత్సరం నీకు తెలియదు, గుండె చప్పుడు ఎప్పుడైనా ఆగిపోవచ్చు,

ప్రకృతి ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు, రోడ్డు ప్రమాదాలు ఎప్పుడైనా జరగొచ్చు, కానీ చనిపోయే లోపు సమాజానికి నువ్వు చేయవలసిన సేవ ఏం చేయగలుగుతున్నావ్? నీ చుట్టూ ఉన్న వారిని మేలుకొలుపు నీ చుట్టూ ఉన్న వారిని నిలబెట్టు. 

ఏసుప్రభు వెళుతూ వెళుతూ 12 మందిని నిలబెట్టాడు ఆ 12 మంది వేసిన పునాది మీద ఇన్ని కోట్ల మందిమి వచ్చాం. కొంతమందినైన నీ ద్వారా నిలబెట్టు నీ జీవిత కాలం నీవు ఏ విధంగా అయితే ప్రభు ప్రేమను పొం ది బ్రతుకుతూ ఉన్నవో నీతో పాటు నీ తోటి వారిని, నీ చుట్టూ ఉన్న వారిని ప్రభు ప్రేమలో నిలబెట్టి అంతం వరకు ప్రభువు కొరకు బ్రతికే విధంగా నీలోని ప్రభు వెలుగు వారికి చూపించి బలవంతులు చేసి నాశనానికి జోగుతున్న వారిని రక్షించి ఈ లోకంలో నీ తనువు చాలించు. 

ఆపై దేవుడు నీకు పరలోకం తో పాటు తండ్రి చూసే భాగ్యం న్ని పొందు. లేకపోతే నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి దేవుని కోపానికి బలియై నరకానికి జారిపోవద్దు.

ఆమెన్

Leave a Reply