ప్రపంచ ప్రజలు పరిష్కరించుకోలేని సమస్య-Telugu Bible Messages

నీ ఈ బ్రతుకు లో ఏది లేకపోయినా కొంతకాలమే బాధ. ఏది లేకపోయినా నువ్వు పడుతున్న బాధ కొంతకాలమే. ఇల్లు లేక బాధ పడుతున్న, భోజనం లేక బాధపడుతు, ఆరోగ్యం సరిగా లేక బాధపడుతున్నా, పేదరికంతో బదాపడుతున్నా, కొద్ది కాలమే కానీ నీ పాపములకు ప్రతికగా నువ్వు అనుభవించ బోయే బాధ ఏదైతే ఉందో అది శాశ్వతం కాలం ఇప్పుడు సమస్య ఏదైనా ఉంటావో చెప్పు. దీని కంటే ప్రమాదకరమైనది పాపం ఈ పాపం వల్ల పాపం వలన శాశ్వత కాలం ఆత్మగా బాధపడాలి.

అంటే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన ప్రమాదం పాపం. అలాంటిది ఈ ప్రపంచంలో ఈ పాపానికి పరిష్కారం ఏదైనా ఉందా? సమస్య వచ్చినపుడు సమస్యకు పరిష్కారం ఉండాలి కదా! ఈ పాపమనే ఈ సమస్యకు ప్రపంచం దగ్గర పరిష్కారం ఏదైనా ఉందా?

telugu bible messages

డాక్టర్ దగ్గర గారు వెళ్ళారనుకోండి తలనొప్పి అంటే టాబ్లెట్ ఇస్తాడు. నీకు డాక్టర్ తల బాగా వస్తుంది అంటే అతని దగ్గర ఉన్న టాబ్లెట్ ఇచ్చి ఇది వేసుకో తగ్గిపోతుందట అంటాడు. మరి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఏం చేయమంటారు అని డాక్టర్ ను అడిగితె  ఆయన ఏం చెప్తాడు. దానికి ఇంకా మందు ఎవరు కనిపెట్టలేదమ్మా.. ఉంటే నేనే వేసుకోవాలి నాకు వస్తున్నాయి మీలాగే అంటాడు డాక్టర్ గారు. ఇక్కడ ఒప్పుకోవాలి తప్పదు. 

పాపానికి మందు లేదు, కనుగొనలేదు. ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రవేత్త కూడా దీనికి మందు భవిష్యత్తులో కూడా కనుక్కోలేరు, ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా ఈ పాపానికి పరిష్కారం కనుగొనలేడు. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరకాలి. దేవుడు ఒక్కడే పరిష్కారం, ఆయనే పరిష్కరించగలడు. 

ఈరోజు ప్రపంచ దేశాల సమస్యల కొరకు ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం కలిసి ఐక్యరాజ్యసమితి అని సమస్యను సమస్త సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. అందులో భద్రతా మండలి అనేది ఒకటి ఉంది. ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం ప్రతినిధులు అందరు సమావేశంలో కూర్చుంటారు. మరేంటి మన దేశాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు అనే చర్చించుకున్నప్పుడు. అందరూ చెప్పే ప్రధానమైన సమస్య ఏమిటంటే ఉగ్రవాదం. ఎందుకంటే ఈ రోజు అమెరికాలో బాంబులు పేలుతున్నాయి, ఇండియా బాంబులు పేలుతున్నాయి, పాకిస్తాన్ బాంబులు పేలుతున్నాయి, రష్యాలో బాంబులు పేలుతున్నాయి, సిరియాలో బాంబులు పేలుతున్నాయి. అంటే ప్రపంచంలో లో సుమారుగా అందరూ ఒకచోట సమావేశం అయ్యారు అంటే ఆ సమావేశంలో తప్పనిసరిగా వచ్చే ప్రధాన సమస్య ఉందంటే ఉగ్రవాదమే. 

ఈ సమస్యను పరిష్కరించడానికి మన అందరము ఒకటవుదాం అని సమావేశంలో ఈ సమస్యను పరిష్కరించడం కోసం చర్చలు జరుపుతారు.

ఏ సమస్య గురించి మాట్లాడిన మాట్లాడకపోయినా ఈ సమస్య గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఒక సమస్య కనబడుతుంది ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే దిశలో, కోణంలో ఆలోచిస్తున్నారు.ఒక రోజున ఈ సమస్యను పూర్తిగా లేకుండా నిర్మూలన చేయవచ్చు.

పాపం విషయానికొస్తే ప్రపంచ దేశాలు కూర్చున్న అందరు ఒక నిర్ణయానికి వచ్చిన ఈ సమస్యకు మాత్రం పరిష్కారం కనుగొనలేరు దీనికి ఏ విధమైన పరిష్కారం చూపించలేరు.

ఎవ్వరు ఈ పాపం అనే సమస్యకు పరిష్కారం చూపించ లేరు. ఎవ్వరు పాపం లో ఉన్న మనుషులను పవిత్రులు లను చెయ్యలేరు. అంటే మనిషి ఇక్కడ పరిశుద్ధుడు అయితే తప్ప మనిషి మరణం తర్వాత పరలోకానికి చేరలేడు ఇక్కడే పరిశుద్ధుడు కావాలి ఇక్కడే మనిషి పాపాలన్నీ తీసి వేసుకోవాలి. దీనికొరకు ఏముంది పరిష్కారం అని అడిగితే ఈ పాపం అనే సమస్యకు పరిష్కారంగా కన్న తండ్రి అయినా ఆ పరలోకపు తండ్రి దేవుడు ఒకరిని ఈ లోకానికి పంపించాడు ఆయనే యేసుక్రీస్తు.

ఆయనే చెప్పాడు “ప్రయాసపడి భారము(పాపం) మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి” మత్తయి సువార్త 11:28.

Genesis(ఆదికాండము) 18:20

20.మరియు యెహోవాసొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది.

పాపము అనే భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ప్రభువు.

ఈ పాపమనే సమస్యతో బాధపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ప్రభువు.  పాపాన్ని తీసేస్తాను అంటున్న ప్రపంచ చరిత్రలో ఏకైక వ్యక్తి ఏసు క్రీస్తు మాత్రమే.ఇంకా ఎవ్వరు లేరు.నా యొద్ద కు రండి  ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయనలో ఏ పాపం లేదు గనుక ఏ పాపం లేని వాడు మాత్రమే నీ పాపం తీయగలడు.

“నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు” అని అన్నాడు ఏసుక్రీస్తు.

ఆయన మాత్రమే చూపించగలరా పరిష్కారాన్ని,ఆయన మాత్రమే పరిష్కరించగలడు ఈ సమస్యకు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమ పవిత్రుడు, ఏసుక్రీస్తు వారు.అందుకే పిలిచాడు మీరు పాపం చేసి తండ్రి ఆగ్రహానికి లోనైపోతున్నారు. తండ్రి కోపానికి మీరు బలైపోతున్నారు అలా మీరంతా పాతాళానికి జారిపోతున్నారు అందుకే పాతాళానికి వెళ్లి బాధ పడిపోతున్న భయంకరమైన మంటల్లో కాలిపోతుంది మీకోసం ఈ భూమి మీదకి నన్ను పంపాడు ఇదిగో నేను చూపిస్తున్న ఈ మార్గంలోకి వచ్చేయండి ఈ పాపమనే సమస్యతో బాధపడుతున్న మీరందరు నాయొద్దకు వచ్చేసేయండి మీ పాపాలను తీసి వేస్తాను అన్నాడు అందుకే ఓకే కే అందుకే భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి సమస్త జనులారా అంటున్నాడు. యూదులు, ఇశ్రాయేలీయులు అని బేధం లేదు వారు మాత్రమే పాపుల మనము కూడా పాపులమే. భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపం బాధపడుతున్నాడు.

పాపం చెయ్యటం అనేది మనిషి కి చాలా సులువు.
Hebrews(హెబ్రీయులకు) 12:2

2.మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు(మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

పాపం చాలా సులువుగా నిన్ను పడేస్తుంది అంటున్నాడు పౌలు గారు. అసలు నువ్వు అనుకోవు పాపం లో పడిపోయాను అని.ఇలాంటి పరిస్థితిలో ఉన్న ప్రపంచ ప్రజలు ఈ సమస్యకు పరిస్కరమైన యేసుక్రీస్తు స్వీకరికపోతేఆ నిత్యగ్ని దండనకు జారిపోతారు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా బ్రతికి తీరాలి. ఇక మనము జాగ్రత్త పడక పోతే ఏ రోజు చనిపోతమో తెలియదు కాబట్టి ప్రభువు ను స్వీకరించి పాపానికి దూరంగా బ్రతుకుదాం. ఈ రోజు ప్రపంచ ప్రజలందరూ పాపం అనే భయంకరమైన రోగంతో బాధ పడుతున్నారు. దయచేసి అలోచించి పాపానికి దూరంగా ఉంటాలంటే యేసు క్రీస్తును రక్షకుని స్వీకరిచి ఈ పాపాలను ఒప్పుకొని, దేవుని ఎదుట పశ్చాతాపపడి, నీ అంతం వరకు ప్రభువు కొరకు బ్రతుకు. 

Leave a Reply