సేవలో శ్రమపడుతున్నవా సుకపడుతున్నావా-paul’s struggles

సువార్త కి వెళ్తున్నప్పుడు ఎవరైనా నా చెంప మీద కొట్టినప్పుడు సువార్త కి వెళ్తామా నిజం చెప్పండి దేవుడి కోసం వెళ్తున్నప్పుడు కనీసం ఉగ్రవాదం అడ్డుకోలేకపోతున్నాడు అని ఆబాండం వేసేస్తాం. పొరపాటున ఎవరైనా మనల్ని కాని మాట అన్నారంటే “ఎవరు పడతారని ఈ కష్టాలు నేను నిజాయితీగా సేవ చేస్తుంటే” అని మనకి మనమే అనుకొని సేవను విరమించుకుంటాం.

pauls struggles

పౌలు గారిని దేవుని సేవకుడు అని చూడకుండా కొట్టేసారు పదిమందిలో అయినా ఆయన లక్ష్యం మారలేదు, ఆయన గురి మారలేదు, గాలికి ప్రయాస పడుతున్నట్టు ఆయన లక్ష్యాన్ని ఎటు పడితే అటు తీసుకెళ్లలేదు

చాలామంది సేవలో ఉంటారు చాలా బాధ కలుగుతుంది. సేవకులు అటు ఇటు తిరుగుతూ అస్థిర లుగా అటు పోయి ఈ సేవ చేస్తూ, అటు పోయి ఆ సేవ చేస్తూ, అటు ఇటు నిలకడ లేని వారిగా తిరుగుతూ ఉంటారు సేవలో ఉన్న లక్ష్యాన్ని మర్చిపోతారు

బస్సు రాలేదనుకోండి ఏమంటాం దేవుని పని మీద వెళుతున్నప్పుడు దేవుడు కనీసం వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం లేదు అని దేవుడు కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదని అంటూ ఉంటారు కానీ బైబిల్ లో ఈ వచనాన్ని చూసి సిగ్గుపడాలి మనం.

మనం చిన్న చిన్న విషయాలను కంపేర్ చేసుకుంటారు అమ్మ గారు ఊరు వెళ్తున్నారంట వర్షం ఆపేయాలి అంట ఆ వర్షాన్ని ఆపక పోతే ఏసు నిజ దేవుడు కాదంట ఒకవేళ నిజ దేవుడు అయితే ఆ వర్షాన్ని ఆపాలట ఏం అర్థమైంది అండి వీళ్లకు బైబిలు.

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 11:23,24,25,26,27,28

23.వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. 

24.యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; 

25.ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. 

26.అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని. 

27.ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. 

28.ఇవియును గాక సంఘము లన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది.

పౌలు గారిని ఒకసారి చూడండి సముద్రంలో. సముద్రంలో ఇబ్బంది పడ్డాడు. గోదావరి నది మనందరికి తెలుసు ఆ గోదావరి నది అవతలి వైపు ఒక ఊరు ఉన్నది అనుకుంటే ఆ వూరికి గోదావరి నదిలో ఈదుకుంటూ ఎంతమంది బైబిల్ తల మీద కట్టుకుని ఈదుకొని వెళ్లి ఎంతమంది సువార్త కోసం వెళ్తారో చెప్పండి పిల్ల కలువ ఈదగడానికి మనం ఎంతో కష్టపడి పోతాం. అరేబియా సముద్రం ఆనుకొని ఉన్న సముద్రాల మీద ప్రయాణం చేస్తున్న మెరీడియన్ సముద్రం లో అనేక సందర్భాలలో సముద్ర మీదనే తన జీవితాన్ని గడిపాడు ఆ సముద్రాల మీద అ కనీసం వెలుగు కూడా లేని ఆ సమయంలో రాత్రి సమయాలలో ఆ మహా సేవకుడు ఎలా గడిపాడో? ఎలా తిరిగాడో ? అలా సముద్రం మీద ఒక రాత్రంతా తేలుతూనే ఉన్నాడు.
పౌలుగారిని సాక్ష్యం చెప్పమంటే
దేవుడు:పౌలు రాత్రంతా సముద్రం మీద ఉండి పోయావా? ఎందుకయ్యా నీకు ఇంత కష్టాలు
పౌలు: ప్రభువు గురించి ఒక రోజు ఏంటి సంవత్సరమైన సముద్రంలోనే ఉంటాను అని అంటాడు.

ఇదే గనుక సినిమా చేస్తే మనసున్న వాడు దీని దృష్టి రూపం ఇస్తే ఎడ్చేస్తామండి.
ఒక రాత్రంతా లైట్ కూడా లేకుండా ఎలా ఉన్నడో? ఎవ్వరు లేనప్పుడు 12 గంటల ప్రాంతంలో గోదావరి ఒడ్డు కి వెళ్ళు ఆ రేవు దగ్గరికి వెళ్లి చూడు ఎలా ఉంటుందో తీక్షణంగా. తెల్లారేసరికి జ్వరం వచ్చేస్తుంది మనకి. ఒక రాత్రంతా సముద్రం పైనే అలానే ఉండిపోయాడు. ఏంటయ్యా నీ గురి పౌలు అని అంటే సమాజానికి సువార్త చెప్పాలి అని అంటాడు పౌలు గారు.

ఇంకా మనము పౌలు గారి శ్రమల గూర్చి ఆలోచిస్తే…….

ప్రయాణం లో కలిగే ఆపదలోను, నదుల వలన ఆపద లోనూ, దొంగల వలన ఆపద లో నా మహా సేవకుని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు చూడండి దొంగలు దొంగల వలన ఆపదలను నదుల వల్ల నైనా ఆపదలో ఉన్న ఇవన్నీ ఒక ఎత్తయితే
వీరే నా సొంత వారు, వేరే నా అయిన వారు, వేరే నేను నమ్ముకున్న వారు, వీరి ద్వారా ఇంకా సేవ బాగా జరగాలని ఎవరినైతే నమ్ముకున్నారో జనులే చేశారో తెలుసా స్వజనులవలన ఆపద వచ్చేసింది పౌలు గారికి

సేవకుడు ఎక్కడైతే ఇబ్బంది పడకూడదో అక్కడ ఇబ్బంది పెడుతున్నాడు. సొంత జనుల శత్రువులు అయ్యారు సొంత వారే సేవలో పౌలుగారు ని ఇబ్బంది పెడుతున్నారు. సొంత వారే ఉరులు పలుకుతూ చెరసాలకు స్వాగతం చెబుతున్నారు. ఇన్ని పెట్టుకున్నాడు ఆ మహా సేవకుడు.

పౌలు లగ్జరీ లైఫ్ బతకాలని అనుకుంటున్నారా పౌలు గారికి లగ్జరీ లైఫ్ తెలియదు అనుకుంటున్నారా అన్ని వదిలేసుకున్నాడు క్రీస్తు కొరకు.

గుర్రాలమీద తిరుగుతున్నప్పుడు లగ్జరీ లైఫ్ బ్రతకాలని ఉన్నప్పుడు ఆ లైఫ్ అంతా వదిలేసి చాలా తక్కువగా దిగువ స్థాయికి దిగిపోయి వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని, పవిత్రాత్మ చేత నడిపింప బడుతూ, పేదల మధ్య తిరుగుతూ, సమాజ మందిరాల మధ్య తిరుగుతూ, అన్నం పెట్టే వారు లేకపోయినా, నాకు ఆకలేస్తుంది అని దేవునికి కూడా కంప్లైంట్ చేయకుండా, ఈ అన్నం లేక పోయినా నా తండ్రి కోసం ఉపవాసం ఉంటూ కన్నీళ్లను దిగమింగుకుని ఎన్నో కష్టాలు పడుతూ సంఘాల కొరకు ఇన్ని కష్టాలు అనుభవిస్తుంటే చివరికి కూడా సంఘ సహోదరులు హింసించారు.

ఆరోజు తరచుగా జాగారాలు, ఆరోజు తరచుగా ఉపవాసాలు, ఆరోజు తరచుగా కన్నీళ్లు. ఈరోజు తరచుగా లగ్జరీలు అయ్యగారి ఫుడ్ చూస్తే ఒక లగ్జరీ ఫుడ్ మెనూ. ఏం తింటారు మీరు అడిగినప్పుడు అది కావాలి ఇది రూం తీసుకొ అని సూట్ వేసుకుని కాలు మీద కాలేసుకుని చమట కూడా పట్టకుండా ఏ.సి ఫుల్ మూడు లో పెట్టుకొని ఆ తర్వాత అయ్యగారు భోజనం చేస్తారు.
ఇదా ఈరోజు సేవ అంటే ఆ రోజు చూడండి పౌలుగారి సేవ ఎలా ఉందొ. ఆ రోజుల్లో జనాలను పౌలుగారు తన మాటల ద్వారా తన క్రియల ద్వారా ఎంతో ప్రభావితం చేశాడు

అందరిలా పౌలు గారు కూడా సంఘాన్ని చూసుకొని వచ్చిన జనాలను చూసుకొని లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే చాలా అనుభవించవచ్చు చిన్న మెలిక వేసడంటే అంటే జనాలను కుప్పిగంతులు వేయించోచ్చు. ఐన పౌలు గారు అన్ని వదనుకున్నారు. నాకు అన్నం లేక పోయినా పర్వాలేదు, నేను ఆకలిదప్పులతో ఉన్న పర్వాలేదు, నాకు నిద్ర లేక పోయినా పర్వాలేదు, నేను జాగారాలు రోజు అనుభవించిన పర్వాలేదు నా క్రీస్తు సమాజానికి అందలి అంతే అని కంకణం కట్టుకున్నాడు. క్రీస్తును ఎలాగైనా సమాజానికి పరిచయం చేయాలి సామాన్యుడు మొదలుకొని సామంతుడు వరకు, రాజుల రాజులు మొదలుకొని పేదల వరకు క్రీస్తు సువార్తను అందజేయాలని అంతే.

ఎందుకయ్యా ఇంత ఆసక్తి, ఎందుకయ్యా ఇంత వాంఛ నీకు అంటే.ఆయన వెళుతూ వెళుతూ నా భుజాల పైన నా గొప్ప బాధ్యత నా పెట్టి వెళ్లిపోయాడు ఈ వెలుగును నేను ఎలాగైనా మోసుకేల్లాలి అని కంకణం కట్టుకున్నాడు.
అది సేవ అంటే, అది కసి అంటే. గంటసేపు చర్చిలో గడిపి వెళ్ళిపోవటం కాదు సేవంటే. దేవుని కొరకు ఇంపైన సువాసనగా మారి క్రీస్తు కొరకు రాలిపో.

ఒక రోజు గంట లేట్ అయింది అంటే మీ ముఖాలను వికారం అయిపోతాయి గొప్ప గొప్ప సేవకులు దైవ సేవకులు ఎంతో మంది చనిపోయారు అండి సేవ కొరకు. ఎంతోమంది సేవకుల ఆరోగ్యం పాడైపోయాయిసేవ కొరకు. ఒక్కరోజు గంట లేట్ అయింది అంటే మన ఆకాశం వైపు చూస్తూ ప్రసంగికుడి వైపు చూస్తాం. సేవలో తిరుగుతున్న సేవకుడు తిరగండి వారం లోపల మంచం పట్టిస్తారు

వారు ఎందుకు అలా ఉంటారో తెలుసా దేవుడు వారికి ఇచ్చిన ఉచిత కృప

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పౌలుగారు నాకు ఒక బాధ ఉందయ్య అంటున్నాడు ఏంటయ్యా ఆ బాధ మనం బైబిల్ లో చూస్తే సంఘము లన్నింటిని గూర్చిన చింత నాకు కలదు

ఆ సీన్ లో ఆరోజు మనం ఉంటే బాగస్వామి దొరకలేదని బాధ, ఆ రోజు మనం ఉంటే ఇల్లు లేదని బాధ, ఆ రోజు మనం ఉంటే అప్పులు తీరడం లేదని బాధ, ఆ రోజు మనం ఉంటే ఉద్యోగం లేదని బాధ, ఇవన్నీ గురించి దేవుని ముందు మన చింతను చూపిస్తాము.ఇవన్నీ గూర్చి పౌలుగారు బాధపడుతున్న వీటన్నిటిని గురించి చర్చించకుండా చింతించకుండా పౌలు గారు సంఘాల గురించి బాధపడుతున్నాడు. ఏమైంది సంఘలకు అంటే సంఘాల గురించి పౌలు గారిని అడిగితే

సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయి సంఘంలో దోపిడీలు జరుగుతున్నాయి, క్రీస్తు సంఘంలో వ్యభిచారం జరుగుతుంది, క్రీస్తు సంఘములో దుర్గ వ్యాపారం జరుగుతుంది, క్రీస్తు సంఘములో యువత చెడిపోతున్నారు, క్రీస్తు సంఘములో లేనిపోని చీకటి అనుకుంటుంది వీటన్నిటి గురించిన బాధ నన్ను తినేస్తుంది అని నేను(పౌలు గారు)దినదినము సంఘాల గురించి బాధపడుతున్నాను.

ఏం తక్కువ అండి పౌలుగారికి అనుభవించాలంటే ఎంతో ఉంది. అన్ని వదిలేసి చెరసాలలో కుంగిపోయి కలం పట్టుకుని కన్నీటితో పత్రికలు రాశాడు క్రీస్తు సంఘాలకు. పౌలుగారు పత్రికలు ఎక్కువగా ఎక్కడి నుండి రాశాడో తెలుసా చెరసాల లో నుండి రాశాడు

జైల్లో ఉన్న వాడు బేలు ఎలా పెట్టుకోవాలని ఆలోచించలేదు, ఏ సుప్రీంకోర్టు ద్వార బయటికి రావాలని ఆలోచించలేదు కృప గల దేవుడు విడిపిస్తే సేవ చేస్తా లేకపోతే లేదు ఈ శిరసాల నుండే పత్రికల ద్వారా సేవ చేస్తానని తన స్టైలే మార్చుకున్నాడు.
ఏ విధమైన వాక్యం బంధింప కూడదు అని సంఘాలకు సువార్త వెళ్లాల్సిందే. దేవుని కొరకు బ్రతకాలి అనుకున్న వాడు కంకణం కట్టుకుంటే అలానే ఉంటుంది, దేవుని కొరకు నిజాయితీగా నిలబడిన వాడు నిద్రపోడు సువార్త ప్రకటన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసాడు పౌలు గారు.

ఎందుకయ్య ఇది అంటే ప్రభు ఇచ్చిన ఉచిత కృప సమాజానికి తెలియజేయాలి. నీకు ఎం అర్థమైంది అంటే నేను పాపాత్ముని.(iam sinner)

నేను పాపిని అయిన ఏసుక్రీస్తు నన్ను కరుణించి ఉచిత కృపను నామీద కుమ్మరించి ఈ రోజు నన్ను బ్రతకడానికి నిలబెట్టాడు. దేవుడు నాకిచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. ఆయన కొరకు నేను చెప్పాలి అని దేవుని సువార్త కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఒక మంచి పోరాటం చేసాడు పౌలు గారు.

మనము కూడా అదే కృపను పొందాము. ఆ కృప పొందిన మనం కూడా మన జీవితాలను వెలుగు వైపు మనము మరలుతూ, అనేక మందికి దేవుడి ద్వార ప్రసాదింప బడిన క్రీస్తు కృపను అందచేయటానికి కొన్ని నిమిషాలు ఇస్తావో, రోజులు ఇస్తావో, సంవత్సలలే ఇస్తావో నీ చేతుల్లోనే ఉంది.

అరిపోయీ నరకానికి వేల్లిపోతవో, వెలిగి నశించిన వారి కొరకు నీ జీవితంలో పౌలు గారి వలే క్రీస్తు సువార్త ప్రకాశం అందరి వేదజల్లుతవో నిర్ణయం నీ చేతిలోనే దేవుడు పెట్టాడు ఆలోచించుకో.

అందరికి వందనాలు………

Leave a Reply