నీవు చేసిన ఉపకారములకు-Neevu chesina Upakaramulaku nenemi lyrics

నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||

వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||

మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||

విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2) ||ఏడాది||

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2) ||ఏడాది||

Leave a Reply