కాలాలుమారిన కన్నీరే-kalalu marina kannire Lyrics

కాలాలుమారిన కన్నీరే మిగిలిన
మారని దేవుడు నిన్ను మరువఎన్నడు
కష్టాలు కలిగిన నా హృదయమెంతో నలిగిన
కాపాడు దేవుడు నీతోనే ఉన్నాడు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

అవమానము లెన్నో తరముచుండగా
నిందలుఎన్నో నన్ను క్రుంగదీయగా
నా చేయి పట్టి నా చేయి పట్టి లేవనెత్తినావూ
నీ సన్నిధానంలో నిలబెట్టిన
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

ఇంతకాలము నన్ను పోషించినవే
నీ రెక్కల నీడలో నన్ను దాచినవే
రానున్న కాలంలో కృపా క్షేమము లు
దయచేయుము కరుణసంపన్నుడా
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

ఆ మహిమ రాజ్యంలో చేరాలని
యుగయుగాలు నీలోనే పరవశించాలని
ఆశతో నేను వేచియున్నాను
నా ప్రియుని రాకకై ఎదురుచూచున్నాను
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

Leave a Reply