గడ్డి పరకే ఈ జీవితం-gaddi parake ee jeevitham song lyrics

గడ్డి పరకే ఈ జీవితం ఎందుకు నీకీ ఆరాటం
మహిలో…. నీవు మట్టి పురుగువు
విలువెలేని గడ్డి పువ్వువు

క్షణభంగురమే ఈ లోక మాయలు
గగనపుకుసుమలే ఈ లోక అశలు
ఎండమావి వెంటే పయనం
తీర్చదు నీ దాహం
ప్రభువు ఇచ్చెనులే జీవ జలం
తీర్చుకో నీ ఆత్మ దాహం

అల్ప కాలమే ఈ లోక ప్రేమలు
అశాశ్వతమే ఈ లోక బంధాలు
లోకం కోసం ఆరాటం చేర్చదు నిను పరలోకం
ప్రభువు ఇచ్చిను శాశ్వత జీవం అందుకో ఆ ఆత్మ ఫలం

Leave a Reply