దావీదు పట్టణమందు-davidu pattanamandu yesu puttinadu Lyrics

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు
మన కొరకు వచ్చినాడు రక్షకుడేసయ్యా
పల్లె పల్లె వెళ్లి ఈ వార్త చెప్పి మనమంతా
చేరి సంబరమే చేద్దామూ
మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా

పాపుల కోసం వచ్చాడమ్మ మనిషి రూపిగా మారాడమ్మ
ప్రేమను పంచే పావనుడోయమ్మ
పాపమే లేని పరిశుద్ధుడు
దేవదేవుని ప్రియ సుతుడు
దాసుని రూపం దాల్చాడోయమ్మ
మన బ్రతుకులు లలో వెలుగులోనే వెలుగులోనే తెచ్చాడోయమ్మ

వేదన బాధలు ఇకలేవమ్మా పాప దాస్యము పోయిందమ్మా
రక్షకుడేసు వచ్చాడోయమ్మ
హృదయమంత నిండే ఆనందమే
సంబరాలు చేసే ఈ జనమే
ఆడి పాడి ఇ కొనియాడదమోయమ్మ
మనసారా ఏసు రాజుని కొలిచెద మోయామ్మ

Leave a Reply