దుఃఖపడువారు ధన్యులు-Crying in the presence of God in Telugu

దుఃఖపడువారు ధన్యులు అని బైబిల్ లో ప్రస్తావించాడు ఏసుక్రీస్తు. ఎందుకు దుఃఖించాలో? ఎవరి కొరకు దుఃఖించాలో? ఎలా దుఖించాలో? దాని లోతు ఏంటో తెలియాలంటే ఈ దివ్య గ్రంధాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకు నేర్పిస్తునది

నీ ముందు నేను ఏడ వలసిన అవసరం లేదు నా ముందు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఏడ్చే గడియలు ఉంటాయంట ఎవరి ఎదుట ఏడ్వాలట దేవుని ఎదుట.దేనికొరకు ఏడవాలని ఏసుక్రీస్తు చెబుతున్నానంటే ఆధ్యాత్మిక తీవ్రతకు కొరకు.

దీని ద్వారా ప్రభువు ఏం చెబుతున్నాడో ఆలోచించండి.

దేని కొరకైయ్యా నేను ఏడవాలి అంటే సొమ్ము కొరకు ఏడ్వదట, నీ చదువుల కొరకు, నా ఉద్యోగం కొరకు కాదట ఏడవాల్సింది, మొన్న కాంతి కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఒక్క మార్కులు పోయిందని ఏడ్వా కుడదట మరి దేని కొరకు ఏడ్వాలి అంటే నా స్థితి నీ దగ్గర బాగలేదని ఏడవాలి, నా లైఫ్ స్టాండింగ్ నీ దగ్గర బాగాలేదు ప్రభువా అని ఏడ్వాలట.

దావీదు గారు కీర్తనలు 51 అధ్యాయంలో అంటున్నారు

Psalms(కీర్తనల గ్రంథము) 51:2,3,4,5,7,9,10,11,12,13,14,15

2.నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.
3.నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.
4.నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.
5.నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
7.నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.
9.నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.
10.దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము.
11.నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.
12.నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.
13.అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.
14.దేవా, నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును.
15.ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.

దావీదు:దేవా! ఏ విధముగా చూసిన నీ ఎదుట నేను దుర్మార్గుడును, పాపాత్ముడును నీ ఎదుట నేను తలెత్తడానికి కూడా అర్హత లేని వాడను అని ప్రభు పాదాలు పట్టుకుని నన్ను దాటిపోవద్దు అయ్యా అని ఏడ్వాలట.

దేనికొరకు ఏడవ మని ఏసుప్రభు కొండమీద ప్రసంగం లో చెబుతున్నాడు, దేని కొరకు దుఃఖించమని కొండమీద ప్రసంగం లో చెబుతున్నాడు అంటే నీ పాపాల కొరకు ఏడవండి. నీ పాప జీవితము కొరకు, నీ రోత జీవితం కొరకు ఏడవండి ప్రభువు దగ్గర. అప్పుడు మనకు ఏమి వస్తుందో తెలుసా ప్రభువు యొక్క ధన్యత వస్తుంది

భక్తుడైన దావీదు గారి జీవితంలో జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది పాపం చేసినప్పుడు ఎలా ఉంటుందో చెబుతున్నడూ గుర్తుపెట్టుకోండి
దావీదు గారు పాపం చేస్తున్నప్పుడు తాను పాపం లో ఉన్నానని మరొకరు వచ్చి చెప్పేదాకా ఆయనకు అర్థం కాలేదంటే ఆయన ఎంత డేంజర్ జోన్ లో ఉన్నాడో అర్థం చేసుకోవాలి. దావీదు పాపం చేసినప్పుడు కూడా తనకు అర్థం కాలేదు అంటే పాపం దావీదు గారికి ఎంత వాడుక, వేసనం అయిపోయిందో ఆలోచించండి

కాని విచిత్రం ఏంటంటే దావీదు గారి జీవితంలో చేసినది ఒకే ఒక పాపమట. ఏంటది బత్సెబా తో పాపం చేసాడు. ఒక్క పాపం చేసిన దావీదు గారు ఎలా ఏడ్చాడో తెలుసా గుర్తుపెట్టుకోండి పరుపు లేచి పోయాలా ఏడ్చాడట, ఏంటది పరుపు లేచిపోయే కొట్టుకుపోయే ఏడ్చాడట
యేసు క్రీస్తు వారి పాదాలు కడగాలంటే కనీసం చెంబెడు నీళ్లు కావాలి. మరి మరి పరుపు లేచి పోవాలంటే ఎంత ఏడవాలి.
ఎంతగా ఏడ్చాడు చెప్తున్నాడో చూడండి ఎందుకయ్యా ఇంత ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావ్ అంటే ఒకే ఒక్క పాపమట. దావీదు బత్సభ విషయంలో పాపం చేయడం తప్ప మరే ఏ తప్పు చేయలేదని దేవుడే దావీదు గురించి చి సాక్ష్యం ఇచ్చాడు. ఒక్క తప్పు కొరకు ఇంతగా ప్రలపన చేసి ఏడిస్తే మనలో ఎన్నో తప్పులు ఉన్నాయి. ఏ రోజైనా నీ పాపాల కొరకు ఏడ్చవా అసలు. ఒక్క తప్పు కే పరుపు లేచిపోయేల ఏడ్చాడు మన తప్పులకి ఇంకేం లేచి పోవాలి ఒక్క తప్పు కి పరుపు లేచిపోతే ఒకవేళ ఇలా అనొచ్చేమో నీ పాపాల కొరకు ఏడ్చే ఏడుపుకి నీ మంచం కూడా లేచి పోవాలి అంతగా ఏడవాలి

ఒకటా రెండా పుట్టిన దగ్గరనుంచి మొదలు పెడితే లెక్కలేనన్ని పాపాలు చేశాము మనం. దావీదు గారు ఎలా ఒప్పుకుంటున్నారు చూడండి.
నాతను ఎంత ధైర్యంగా అన్నాడో చూడండి “నువ్వే ఆ పాపం చేసింది అని దావీదు మొఖం మీదనే అనేసాడు నాతను. నేను చెప్పిన కథలో సారాంశం ఎవరు తెలుసా దావీదు నువ్వే అని నాతాను అన్నాడు. అనగానే సింహాసనం మీద నుండి కుప్పకూలిపోయాడు దావీదు. “నువ్వే తప్పు చేసింది నువ్వే తప్పు చేసింది ఆ దిగజారుడు పని చేసింది నువ్వే దావీదుతో అనగానే నువ్వే నాకు చెప్పేది అని అనలే.

నా పాపం నాకు అర్ధ అవన్నంతగా నా కళ్ళు కప్పేసింది అని దావీదు కి అర్థమైంది
నా కనులకు కోరలు కమ్మేసింది పాపం నా స్తితి అంతా గడ్డుబారి పోయింది నాకు అర్థం అయింది అని ఏడవటం మొదలు పెట్టాడు ఏడుస్తూనే ఉన్నాడు చచిపోయెంత వరకు.

ఈ తప్పు తర్వాత దావీదు చాలా దీన స్థితిలోకి వెళ్లిపోయాడు చాలా డల్ అయిపోయాడు కొడుకులు ఊసెల మాట్లాడుతున్న సర్లే అనేవాడట ఎందుకో తనకు అర్థం అవుతుంది.

మనం ఎప్పుడూ మౌనంగా ఉంటామో తెలుసా
మనల్ని మనం దిగిపోయినప్పుడు, ఎప్పుడు తక్కువ మాట్లాడుకుంటమో తెలుసా నేనేంటో నాకు అర్థం అయినప్పుడు దిగిపోయి మాట్లాడుకుంటం

మనం ఊరికనే పొగరు పొగరు గా మాట్లాడుతునమంటే అంటే అర్థం ఏంటో తెలుసా నీకు సరైన మారుమనస్సు లేదు

ప్రతి ఒక్కరి జీవితాల్లో అది ఉంది, ఇది ఉంది అని అంటున్నావ్ అంటే ఒకరిలో నీకు నలుసు కనబడుతున్నది అంటే నీ కంట్లో దూలం ఉందని నీకు కనబడడం లేదా?. దూలం ఎక్కడో లేదు నీలోనే ఉంది.

దావీదు అర్ధం అయిందట” నేను నా కంట్లో దూలాన్ని మోస్తున్నానని” ఒక తప్పు అని నువ్వు అనుకుంటున్నావు దేవా కానీ నేను భరించలేక పోతున్ననయ్య.

Psalms(కీర్తనల గ్రంథము) 51:2

2.నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.

నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము నా అతిక్రమములు లో నాకు తెలిసే ఉన్నవి.

తెలిసి తెలిసి తెలిసి తెలిసి చేసేసాను ప్రభువా నా మనస్సాక్షి నన్ను వేధిస్తున్న, గద్దిస్తున్న తప్పై తెలిసే ఉన్నవి నేనేం చేశానో తెలుసా పాపం చేశాను
నీ ఎదుట నేను నా మొహం ఎత్తుకోవాలి అర్థం కావడం లేదు దేవా” అని దావీదు వేదనతో కుమిలి పోయాడు.

బత్సభా ను పెళ్లి చేసుకున్నాడు కానీ తను చేసిన పాపాన్ని తలచుకుంటూ చచ్చిపోయేంత వరకు తన మనసులో ఆ పాపం దోబూచులాడుతునే ఉండేది.

ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు నేను తెలిసే పాపం చేశాను నాకు తెలుసు గనుక నా హృదయాన్ని చింపుకొని అడుగుతున్నాను “ప్లీజ్ తండ్రి నన్ను క్షమించవా” దేవుడి దగ్గర ప్రాధేయ పడ్డాడు.

ఎలా దుఃఖపడలో ప్రభువు దావీదు గారి ద్వారా నేర్పిస్తున్నారు. దుఃఖపడువారు ధన్యులు అంటే నేను ఎలా దుఃఖ పడాలంటే, ఆధ్యాత్మిక చింతన కొరకు, పాపాల కొరకు ఎలా దుఃఖ పడుతున్నట్టుగా ఇప్పటి వరకు చూసామో అలా దుఃఖపడు.

బైబిల్ లో ఉన్న భక్తులను చూస్తే, వారికి ధన్యత ఎలా వచ్చిందంటే ఏడ్చి ఏడ్చి వారు ప్రభువు ధన్యతను సంపాదించుకున్నారు.

మనము కూడా మన జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఉంటాం దయచేసి మనము కూడా మన ఆధ్యాత్మిక చింతన కొరకు, మన పాపాల కొరకు దుఃఖపడదాం.

ఇది చదవగానే ప్రభువు ముందు మొకలేసి ప్రార్థిస్తారనీ
ప్రభు పేరిట ఆశిస్తున్నాను.

అందరి వందనాలు………..

Leave a Reply