ఎవరు ఎవరికొరకు ఆలోచిస్తున్నారు? Christian Messages in Telugu

తెలుగు క్రిస్టియన్ మెస్సగెస్

ఎవరు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు ?

సంస్కరణలు సంతాపాలు శ్రద్ధాంజలి వదంతులు పేరిట మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఎన్నెన్నో కార్యక్రమాలు బ్రతికున్న వారు చేయుట ఈ మానవుల మధ్య గమనించగలం. కుల మత భేదాలు అనేవి మనిషి బ్రతికి ఉన్నప్పుడున్నా, చచ్చే ప్రతి ఒక్కరు స్వర్గానికి చేరాలనే వీరి ఆశ నిరాశగా మిగిలిపోక తప్పదు ఎందుకనగా మనిషి బ్రతికినంత కాలం తన ఆత్మ కొరకు ఆలోచించుటకు ఏనాడూ ఒక్క నిమిషమైనా కేటాయించడు గాని, కడకు ఈ ఆత్మ తన శరీరాన్ని విడిచి పోయినపుడు, అప్పటికి బ్రతికిన తనవారు (బంధువులు) చనిపోయిన అతని ఆత్మకు స్వర్గం ఇవ్వమని దేవుని నీ కోరడంలో న్యాయం లేదు

ఈ జీవిత కాలంలో ఏ సమయమైన శరీరానికి అస్వస్థత చేస్తే, చస్తాననే భయంతో వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు వాడుటకు త్వరపడి ఆత్మ ఏ క్షణమైనా శరీరాన్ని వీడవచ్చునను పరమ సత్యం తెలిసి కూడా ఎందుకు మౌనం వహిస్తున్నాడో మీకు బాగా తెలుసు. సమయం లేక విస్తారమైన లోకపు పన్నుల భారం వలన అలసి తీరకలేకవున్నాడు పోనీ ఎవరైనా కనికరించి నాలుగు మంచి మాటలు బైబిల్ నుండి రాబోయే ప్రమాదాన్ని ముందుగా వివరిస్తూ అతని ఆత్మ భద్రత కొరకు చెబితే చెప్పేవాడికి పని లేక మన ముందుకు వస్తున్నాడు అని తలంచే ఈ మూర్ఖులకు శాంతి కలగాలని పరలోకం చేరాలని గాని కోరే హక్కు భూమ్మీద చావక మిగిలిన తన వారికి లేదని తెలుసుకొనుట ఎంతైనా మంచిది అంటే బ్రతుకుతున్న వారు చనిపోయిన వారి కొరకు ఆలోచించవలసిన అవసరం లేదని అర్థము అందుకే 

ఫిలిప్పీ 2:21

అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచు ఉన్నారు గాని ఏసుక్రీస్తు కార్యములను చూడరు”

శరీరాలలో ఉన్నవారు తామెందుకు బ్రతుకుతున్నారో అర్థం కాకనే తన జీవితకాలమంతా ఈ లోకం కోసం బ్రతుకుతున్నారు గాని అట్టివారు చచ్చిన పిమ్మట అప్పటికి బ్రతికున్న తనవారు ఆ చచ్చిన వారికి స్వర్గం తేరచుకోవాలని, శాంతి కలగాలని ఈ భూమి పై అనేక ధర్మకార్యములు వారి పేరిట దేవునికి చేయుచున్నారు. మీకంటే ముందుగా మరణించిన మీ రక్త సంబంధాలు నేడు మీ విషయమై ప్రలపించుచున్నారను సంగతి మీకు తెలుసా? మరొక ఒక యదార్థ మైన గాధ అ తెలుసుకొనుటకు ఈ క్రింద చదవండి.

నేటికి 3200 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ దేశం లో ఒక గొప్ప ధనవంతుడు జీవిస్తూ ఉండేవాడు అతడు ఉదా రంగు బట్టలను సన్నపు నారా వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖ పడుచూ ఉండేవాడు. అందరివలె రానే వచ్చింది మృత్యువు ఈ ధనవంతునికి అతనికున్న అంతస్తును బట్టి ఈజిప్ట్ దేశంలో ఎంతో ఘనంగా ఎన్నో భారీ ఏర్పాట్లు మధ్య మిగిలిన ఐదుగురు సోదరులు సమాధి కార్యక్రమమును, సంస్కరణ కార్యక్రమమును కూడా లక్షలాది ప్రజల మధ్య జరిపించిరి. ఇంటికి పెద్దవాడు గనుక తోడబుట్టిన వారు వెనకుండి మిగిలిన ముగింపు పనులు పూర్తి చేశారు ఈ సంగతులు అన్నియు అతడు పోయిన తర్వాత భూమి మీద జరిపించినవి మాత్రమే.

Christian Messages
Christian Messages

మహానుభావుడు బ్రతికినంత కాలం శారీరకంగా ప్రతి దినము సుఖ పడుట అలవాటు పడిన ప్రాణమైన నందు వలన శరీరములో గల ఆత్మ ఆ సంగతి మర్చిపోయాడు. వదిలిన మరుక్షణమే అపవిత్రత్మా గా మారి పాతాళమునకు దిగజారాడు. భూమిపై బ్రతికిన ఏనాడు ఈ పాతాళ సంగతి పట్టించు కోవడం గాని, భయపడడం గాని జరగలేదు. కడకు దయ్యాలు కూడా ఈ పాతాళానికి భయపడుతున్న సంగతి తెలియని వెర్రిబాగులోడు. పాతాళంలోకి పోవుటకు దయ్యముల మైన మాకు ఆజ్ఞాపించివద్దు (లుకా 8:31). అనే దయ్యల మనవి తెలియని వానిగా కనురెప్పపాటులో అతని బ్రతుకు ఒక మహా అగ్నికి ఆహుతి అయిపోయింది. భూమి మీద వలే సుఖపడు మార్గమే ఇక తనకు లేదని తేలిపోయింది గాని అతనిలో ఆశ మాత్రం ఇంకా చావలేదు.

అతనికంటే ముందుగా మరణించిన ఇశ్రాయేలీయుల మూల పురుషుడగు అబ్రహాము అనే వ్యక్తి శాంతికరమైన ప్రదేశంలో నుండుట గమనించాడు. ఈజిప్ట్ దేశం లో అనేక సంవత్సరాలుగా బానిసలై బ్రతుకుతున్న ఇశ్రాయేలియులు వారిని విడిపించుటకు దేవుని పక్షముగా ఫరో రాజును కలిసిన ప్రవక్త అయిన మోషేయు, ప్రవక్తలను కూడా ఈ అబ్రహం సంతానమే నని గ్రహించాడు. ఏలయనగా అబ్రహం ఇస్సాకు యాకోబుల దేవుడైన మా తండ్రి మమ్మును తప్పక విడిపిస్తాడు అనే నమ్మికతో ఇశ్రాయేలీయుల నిరీక్షణ ఈయనకు బాగా గుర్తుంది వారి నమ్మిక ప్రకారంగానే వారి మధ్య మోషే అను ఒక గొప్ప ప్రవక్త పుట్టి ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించుటకు దేవుని పేరిట ఎన్నెన్నో అద్భుత ములను ఐగుప్తీయుల మధ్య జరిగించుట అనేది ధనవంతునికి గుర్తు రాగానే అబ్రహాము ను చూసి ఒక కోరిక కోరాలనిపించింది.

తండ్రి యైన అబ్రహామా! భూమి మీద ప్రతి దినం సుఖపడు చుండు నేను ఇప్పుడు ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను జరిగిందేదో జరిగిపోయింది ఈ పరిస్థితిని ఆలోచించుట వలన ప్రయోజనం లేదు గాని భూమి మీద నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వారిని ఈ వేదన కరమైన స్థలమునకు రాకుండా ఇక్కడి నా పరిస్థితి తెలియజేయుటకు ఒక మంచి ఆత్మను (లాజరు) ఐగుప్తు దేశంలో గల వారి ఇంటికి పంపిన యెడల వారు నా వల్లే శరీరానికి బానిసలుగా మారకుందురని మొరపెట్టేను. అందుకు అబ్రహం ప్రస్తుతం సహోదరుల యొద్దను, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు గనుక నీవారు తప్పనిసరిగా వారి మాటలు వినవలెను అందుకా ధనవంతుడు అబ్రహామా! అలాగా అనవద్దు మృతుల లోకమునుండి ఒకడు ఆత్మగా వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు వెంటనే మనసు మార్చు కొందురు అని అనేను. కనబడు శరీరాలతో చెబితే విననీ భూనివాసులు వారికి కనబడని ఆత్మ గా వెళ్లి చెబితే నమ్మగలరా? నమ్మక పోగా చనిపోయిన వ్యక్తి ఒకవేళ ఆత్మగా తిరిగి వస్తే దయ్యమని ఇంట ఉన్నవారు పారిపోతారు అలా నమ్మనే నమ్మరని అబ్రహాము సమాధానం ఇచ్చేను. (లూకా 16:19_31)

ప్రియమైన వారలారా క్రీస్తు బోధించిన ఈ యదార్థగాథ లో ఎంత సత్యం దాగి ఉందో ఇప్పటికైనా గ్రహించారా?

మృతులు- భూమి మీద అ సజీవుల యున్న తమ వారి కొరకు ఎంత కలత చెందుతున్నారు అనుటలో సందేహం లేదు. అయితే భూమి మీద గల వీరు -తమ్మును తామే శరీర విషయములో సరిచేసుకోనక చనిపోయిన తమ వారి ఆత్మ కొరకు సంస్కరణలు, సంతాపాలు చేయడంలో అర్థం లేదనే చెప్పాలి. ఏసుక్రీస్తు నందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థ మైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు. గనుక నేర్చుకొని రూఢీయని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటిరో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. (2 తిమోతి 3:14,15) సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతిదినము మోషే లేఖనములను చదువుట వలన మునుపటి తరముల నుండి ఇ అతని నియమమును ప్రకటించు వారు ప్రతి పట్టణంలో ఉన్నారని అపోస్తుల లో ఒకరైన యాకోబు చెప్పెను. (అపో.కా 15:21)

ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింప బోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరేమియు చెప్పక అల్పులను, ఘనులను సాక్షం ఇచ్చిచుంటి నని పౌలు చెప్పెను.(అపో.కా 26:22,23)

మీరు ఆశ్రయించుచున్న మోషే ఒక నాడు మీ మీద నుండి నేరమోపెను. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురని ఏసు చెప్పేను. యోహాను 5:39, 45_47

పై వచనములను బట్టి నీకు బుద్ధిని కలగజేసే వేదాన్ని దానిని మీకు బోధించే వారిని నిర్లక్ష్యం చేసి కేవలం మీ శరీరాలకే దాసులుగా మిగిలిపోతే ముందుగా మరణించిన మీ విషయమైనా మీ వారి మొరలు అక్కడ అంగీకరింపబడవు గానీ మీరు దయ్యాలు గా మారి నిత్యాగ్ని దండన కొరకు ఎదురు చూడవలసినదేనని మరచిపోకూడదు లేదా మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము నీవు మాత్రం నన్ను వెంబడించు మత్తయి 8:21,22 అను యేసు మాటకు నేటి నుండే లోబడి నీ వంతు పనిని నీ చావుకు ముందే జరిగించుటకు సిద్ధపడు.

Leave a Reply