Anni Naamamulakanna Ghanamaina Telugu Christian Song Lyrics

అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల||

దేవతలకన్నా దయగలవాడవు
క్షమించు మనసున్న మహారాజువు (2)
ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||

గాలి తుఫానులను ఆపినవాడవు
నీటిపై నడచిన నిజ దేవుడవు (2)
జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||

Leave a Reply