aakarshinche priyudaa Telugu Christian Songs Lyrics

ఆకర్షించే ప్రియుడా…
అందమైన దైవమా…

ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా (4)

నీదు తలపై ఉన్న అభిషేకం
అధికంగా సువాసన వీచుచున్నది (2)
నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)
నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే||

నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది
నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)
నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)
అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే||

నిన్ను పాడి హృదయం ఆనందించును
నాట్యంతో పాటలు పాడెదను (2)
దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2)
అందరికి నిన్ను చాటి చెప్పెదను (2) ||ఆకర్షించే||

Leave a Reply